చలవ మిరియాలు – Chalava Miriyalu – Malladi Ramakrishna Sastry – Book Review
Video / September 15, 2020

మల్లాది రామకృష్ణశాస్త్రి గారి చలవ మిరియాలు పుస్తక సమీక్ష! “ఆయన పలుకుల్లోంచి అమృతం పుట్టింది, అది తెలుగు సినిమా పాటను చిరంజీవిని చేసింది” అని వేటూరి గారు మల్లాది వారికి నమస్సులర్పిస్తే.. “తెలుగుదనం పోయింది-తెలుగు ధనం పోయింది” అంటూ మల్లాదివారు మరణించిన రోజు కన్నీరు మున్నీరుగా విలపించారు ఆత్రేయ. “తెలుగుకున్న రంగూ, రుచీ ఎరిగున్న రచయిత” మన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అంటూ వారిని అంతెత్తున పొగిడారు పాలగుమ్మి పద్మరాజు గారు. తన సినీరంగ ప్రవేశానికి కారకులైన మల్లాది రామకృష్ణశాస్త్రిగాకి, తన సినిమా పాటల పుస్తకాన్ని అంకింతం ఇచ్చి నమస్కరించుకున్నారు శ్రీశ్రీ గారు. సినిమా పాట రాసేటప్పుడు ఎప్పుడైనా, సరైన మాటలేవీ తట్టకపోతే.. “ఈ సందర్భానికి మా గురువుగారు మల్లాది వారైతే ఎలా రాస్తారు” అని ఆలోచించి కలం కదిపేవారట ఆరుద్ర గారు. ఎందరో ప్రఖ్యాత రచయితలకు, కవులకు గురువైన పండిత కవి మన మల్లాది వారు. మల్లాది వారి ప్రతిభను తూచడానికి అంతటి సాహిత్యపు బరువుగల తూనికరాళ్లు కూడా మనకు దొరకవు. కథకుడిగా, సినీ కవిగా, పండితుడిగా ఆయన స్థానం ఎప్పుడూ శిఖరాగ్రమే! సుమారు 80 యేళ్ళ క్రితమే, పేరొందిన అన్ని పత్రికలలో వారి కథలు, వ్యాసాలు అచ్చయ్యేవి. స్వయానా సరస్వతీదేవే కొన్ని విషయాల మీద మాట్లాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ వ్యాసాలు చదువుతుంటే. నా కవి మిత్రులు, మన కథకులు, చలవ మిరియాలు మొదలైన శీర్షికలతో వారు వ్రాసిన వ్యాస పరంపరకు పుస్తక రూపమే… ఈ “చలవ మిరియాలు”. రాజన్ పి.టి.ఎస్.కె #RajanPTSK #Malladi #TeluguLegends

ఆత్మగౌరవ స్వరం | Katti Padma Rao Poetry Book Review by Vinodini Madasu | Dalit Poetry | Self Respect
Video / September 3, 2020

#kattipadmaraopoetry #kattipadmaraobooks #kattipadmaraospeech ఆత్మగౌరవ స్వరం | Katti Padma Rao Poetry Book Review by Vinodini Madasu | Dalit Poetry | Self Respect ఆత్మగౌరవ స్వరం కత్తి పద్మారావు గారి కవిత్వ పుస్తకం. డా వినోదిని గారు ఈ పుస్తక పరిచయాన్ని చేశారు. దళిత కవిత్వంలో కత్తి పద్మారావు కొత్త ట్రెండ్ ను తీసుకువచ్చారు. ధికార స్వరం, తిరుగుబాటు స్వరాలతో పాటు దళిత పల్లెలో ఉండే ఆత్మీయత, ఆత్మగౌరవాన్ని ఆయన తన కవిత్వంలో బయటకు తీసుకు వచ్చారు. కత్తి పద్మారావు గారి కవిత్వ పుస్తకాలు 1. జనగీతం, 2. జైలు గంటలు, 3. దేశం డైరీ, 4. విముక్తి గీతం, 5. రక్త క్షేత్రం, 6. నల్ల కలువ, 7. నీలి కేక, 8. ముళ్ల కిరీటం, 9. భూమి భాష, 10. కటెల మోపు, 11. ఆత్మగౌరవ స్వరం, 12. ఈ యుగం మాది, 13. మనిషే మహా కావ్వం This is review of Dr Katti Padma Rao gari Poetry Book Atma Gourava Swaram done by Dr Vinodini garu. • Karamchedu https://www.youtube.com/playlist?list=PLT3rsQvl5JBIPFbCPuhOVBpBVsp023k46 • Riddles in Hinduism https://www.youtube.com/playlist?list=PLT3rsQvl5JBLfzfCGYBorgZxw0KWMER1_ • Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva https://www.youtube.com/playlist?list=PLT3rsQvl5JBLO7rhQqrKtNIGE2oWnDp8J • Caste Politics https://www.youtube.com/playlist?list=PLT3rsQvl5JBLNAr8URPPElU-WeYwTcgqM • Karamchedu https://www.youtube.com/playlist?list=PLT3rsQvl5JBIPFbCPuhOVBpBVsp023k46 • Master Classes https://www.youtube.com/playlist?list=PLT3rsQvl5JBLH131WZZYBKiMNV3QW2vBg • Katti Padma Rao Inspiring Speechs https://www.youtube.com/playlist?list=PLT3rsQvl5JBL4QNa_lb6vEfBhPRIdztie • Dalit Poetry https://www.youtube.com/playlist?list=PLT3rsQvl5JBJA0tJiBq4QUo2Ft6t6_MDs • Face Book : https://www.facebook.com/FounderDalitMovement/ • Twitter : https://twitter.com/kattipadmarao?lang=en • instagram : https://www.instagram.com/blackscreenin/ • Gmial : chetankathi@gmail.com kattipadmarao@yahoo.co.in masterclasses.blackscreen@gmail.com Black Screen channel intends to bring the voice of neglected. It will be the voice of voiceless in culture, education,…